Corona Virus: దేశంలో 43 ల‌క్ష‌లు దాటిన క‌రోనా కేసులు.. ఒక్క‌రోజులో 1,115 మంది మృతి

India reports 89706 new Corona cases Sep 8th
షార్ట్స్‌లో చూడండి
దేశంలో క‌రోనా కేసుల సంఖ్య 43,70,129కు చేరింది. గత 24 గంటల్లో దేశంలో 89,706 మందికి కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన బులెటిన్‌లో పేర్కొంది.

 అదే సమయంలో 1,115 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 73,890కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 33,98,845 మంది కోలుకున్నారు. 8,97,394 మందికి ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది.  
                                              
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 5,18,04,677 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 11,54,549 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Go Back to Shorts
Corona Virus
COVID-19
India

More Telugu News