East Godavari District: సీతానగరం శిరోముండనం కేసు.. నిందితుల అరెస్ట్ సహా తదుపరి ప్రక్రియను నిలిపివేసిన హైకోర్టు

AP High court Issues Interim orders in seethanagaram tonsure case
షార్ట్స్‌లో చూడండి
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తూర్పుగోదావరి జిల్లా సీతానగరం శిరోముండనం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ నేతల అరెస్ట్ సహా తదుపరి ప్రక్రియను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వైసీపీ నాయకులకు ఊరట లభించినట్టయింది. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలంటూ బాధితుడు వరప్రసాద్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కాగా, ఈ కేసులో ఇప్పటికే ట్రైనీ ఎస్‌ఐ ఫిరోజ్‌షాతోపాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లు అరెస్టయ్యారు.
Go Back to Shorts
East Godavari District
Seethanagaram
tonsure
YSRCP

More Telugu News