Kangana Ranaut: 'డ్రగ్స్' తో సంబంధం ఉందని నిరూపిస్తే... ముంబయిని శాశ్వతంగా విడిచి వెళ్లిపోతా: కంగనా

Kangana says that she leave Mumbai forever if police can find mistake
  • ముంబయి పోలీసులు, హోంమంత్రి ఆదేశాలను పాటిస్తానన్న కంగన
  • కావాలంటే డ్రగ్ టెస్టులు చేసుకోవాలని వ్యాఖ్యలు
  • కాల్ రికార్డులు పరిశీలించుకోవచ్చని సూచన
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ముంబయి పోలీసులను, మహా సర్కారును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్, ముంబయి పోలీసుల ఆదేశాలను సంతోషంగా స్వీకరిస్తానని తెలిపారు. కావాలంటే తనకు డ్రగ్ టెస్టులు చేసుకోవచ్చని, తన కాల్ రికార్డులు పరిశీలించుకోవచ్చని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల విక్రేతలతో తనకు సంబంధాలు ఉన్నాయని నిరూపిస్తే తన తప్పును అంగీకరించి ముంబయిని శాశ్వతంగా విడిచి వెళ్లిపోతానని స్పష్టం చేశారు. త్వరలోనే ముంబయి పోలీసులను, హోంమంత్రిని కలిసేందుకు ఎదురుచూస్తున్నానని కంగనా వెల్లడించారు.
Kangana Ranaut
Mumbai
Police
Home Minister
Anil Deshmukh

More Telugu News