Jagan: కరోనాకు సంబంధించి కీలక ఆదేశాలను జారీ చేసిన జగన్

Dont neglect Corona says Jagan
  • కరోనా పట్ల  వైద్యాధికారులు నిర్లక్ష్యం వహించరాదు
  • ఫోన్ చేసిన వారికి అర గంటలో బెడ్ అరేంజ్ చేయాలి
  • అర గంటలో ర్యాపిడ్ టెస్ట్ ఫలితాలు రావాలి
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈరోజు కరోనా వైరస్ పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి పట్ల వైద్య అధికారులు నిర్లక్ష్యం వహించవద్దని అన్నారు. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని... ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా పరీక్షలను తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు. ర్యాపిడ్ టెస్టుల్లో 30 నిమిషాల్లో ఫలితం రావాలని... ఆర్టీపీసీఆర్, ట్రూనాట్ టెస్టుల్లో 24 గంటల్లో ఫలితాలు రావాలని చెప్పారు.

వారం రోజుల్లో రెగ్యులర్ సిబ్బంది భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని... అదనపు సిబ్బంది నియామకాలు కూడా కొన్ని చోట్ల ఇంకా పూర్తికాలేదని, ఆ ప్రక్రియను కూడా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆసుపత్రిలో చేరేందుకు ఎవరైనా ఫోన్ చేస్తే... అరగంటలో బెడ్ ఏర్పాటు చేయాలని అన్నారు. కాల్ సెంటర్ వ్యవస్థను ఎప్పటి కప్పుడు చెక్ చేసుకోవాలని చెప్పారు.
Jagan
YSRCP
Corona Virus

More Telugu News