TTD: తిరుమలలో వాహ‌నంపై అన్య‌మ‌త స్టిక్కర్.. గుర్తించి సరి చేసిన విజిలెన్స్ అధికారులు

  • అన్య‌మ‌త  స్టిక్కర్ తో కనిపించిన  వాహనం
  • గుర్తించిన విజిలెన్స్ అధికారులు
  • అన్యమత స్టిక్కర్‌పై మ‌రో పేపర్‌ను అంటించిన అధికారులు
sticker on vehicle at ttd

తిరుమల కొండపై ఈ రోజు అన్య‌మ‌త స్టిక్కర్ తో కూడిన వాహనం కాసేపు అలజడి రేపింది. తాజాగా, అన్యమత స్టిక్కర్ అంటించి ఉన్న ఓ వాహనం తిరుమలకు వచ్చింది. రాంబగీచా పార్కింగ్ ప్రదేశంలో ఈ వాహనాన్ని ఉంచ‌గా, దానిపై ఉన్న అన్యమత బొమ్మను పెట్రోలింగ్ విజిలెన్స్ సిబ్బంది గుర్తించారు. అనంత‌రం వెంట‌నే ఆ వాహనంపై ఉన్న ఆ స్టిక్కర్‌పై మ‌రో పేపర్‌ను అంటించారు. ఆ వాహ‌నం తమిళనాడు నుంచి వ‌చ్చింద‌ని గుర్తించిన అధికారులు దీనిపై ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

More Telugu News