Smart Phone: చోరీ చేసిన స్మార్ట్ ఫోన్ ఎలా వాడాలో తెలియక సొంతదారుకు తిరిగిచ్చేసిన దొంగ!

Youth returns smart phone after he can not operate the device
షార్ట్స్‌లో చూడండి
సాధారణంగా చోరీ చేసిన సొత్తును ఎక్కడైనా అమ్ముకోవడం దొంగల ప్రధాన లక్షణం. కానీ ఈ దొంగ అందుకు విరుద్ధంగా వ్యవహరించి ఆశ్చర్యానికి గురిచేశాడు. పశ్చిమ బెంగాల్ లోని బుర్ద్వాన్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఓ వ్యక్తి జమాల్పూర్ పట్టణంలో మిఠాయి దుకాణానికి వెళ్లాడు. అక్కడ తన ఫోన్ మర్చిపోయి ఇంటికి తిరిగొచ్చాడు. ఆ ఫోన్ ను 22 ఏళ్ల కుర్రాడు దొంగిలించాడు. ఆ ఫోన్ ఖరీదు రూ.45 వేలు. ఎంతో ఖరీదైన ఫోన్ కావడంతో  ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దర్యాప్తులో భాగంగా స్వీట్ షాపుకు వెళ్లగా, అక్కడ ఫోన్ లభ్యం కాలేదు. ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తి వేరే నెంబర్ నుంచి తన ఫోన్ కు కాల్ చేయగా స్విచాఫ్ అని వచ్చింది. పదేపదే ఆ ఫోన్ కు కాల్ చేయగా, ఫోన్ కొట్టేసిన యువకుడు ఎట్టకేలకు స్పందించాడు. ఫోన్ ను తిరిగి ఇచ్చేయాలనుకుంటున్నానని, ఆ ఫోన్ ను ఎలా ఆపరేట్ చేయాలో తెలియడంలేదని చెప్పాడు.

దాంతో ఫోన్ సొంతదారు విపరీతమైన ఆశ్చర్యానికి గురయ్యాడు. దొంగే తన ఫోన్ ను తిరిగిచ్చేయాలని చెప్పడంతో నమ్మలేకపోయానని, పోలీసుల సాయంతో ఆ యువకుడి ఇంటికి వెళ్లి ఫోన్ తెచ్చుకున్నానని వెల్లడించాడు. ఫోన్ తిరిగిచ్చేయడంతో ఆ కుర్రాడ్ని ఏమీ చేయవద్దని ఫోన్ సొంతదారు చెప్పడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు.
Go Back to Shorts
Smart Phone
Stolen
Thief
Burdwan
West Bengal
Police

More Telugu News