Kangana Ranaut: ఈరోజు అధికారులు నా ఆఫీసుపై దాడి చేశారు.. రేపు కూల్చేస్తారు: కంగనా రనౌత్

Kangana Ranaut office raided by BMC
  • ముంబైలోని కంగన ఆఫీసుకు వెళ్లిన బీఎంసీ అధికారులు
  • తన ప్రాపర్టీకి అన్ని అనుమతులు ఉన్నాయన్న కంగన
  • నోటీసు కూడా ఇవ్వకుండానే కూల్చేస్తారని వ్యాఖ్య
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు వివాదంలో హీరోయిన్ కంగనా రనౌత్ అనూహ్యంగా ఎంటరైంది. ఆ తర్వాత వివాదం పొలిటికల్ టర్న్ తీసుకుంది. కంగనపై శివసేన నేతలు.. వారిపై కంగన తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. మరోవైపు, ఈరోజు ముంబైలోని కంగన కార్యాలయంపై మున్సిపల్ అధికారులు దాడులు చేశారు. ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా కంగన స్పందిస్తూ తీవ్ర స్థాయిలో మండిపడింది.

'నా ఆఫీసులోకి బీఎంసీ అధికారులు బలవంతంగా చొరబడ్డారు. అంతా కొలిచి చూశారు. నా ఆఫీసు పొరుగున ఉన్న వారిని కూడా టార్చర్ పెట్టారు. ఆ మేడమ్ చేసిన పనికి మీరంతా అనుభవిస్తారని వారిని బెదిరించారు' అని కంగన ట్వీట్ చేసింది.

తన వద్ద అన్ని పేపర్లు ఉన్నాయని, బీఎంసీ అనుమతులు కూడా ఉన్నాయని... తన ప్రాపర్టీలో ఒక్క ఇల్లీగల్ విషయం కూడా లేదని కంగన తెలిపింది. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా, స్ట్రక్చర్ ప్లాన్ కూడా తీసుకురాకుండా అధికారులు ఈరోజు తన కార్యాలయానికి వచ్చారని చెప్పింది. రేపు ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే ఆఫీసును కూల్చేస్తారని మండిపడింది.
Kangana Ranaut
Office
BMC
Bollywood

More Telugu News