Sanchaita: అయ్యన్నపాత్రుడు గారూ, మీకిది భావ్యమా?: సంచయిత గజపతి ప్రశ్నల వర్షం

Sanchaita Gajapathi fires in TDP leader Ayyanna Patrudu
  • తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం
  • టీడీపీ ఎందుకు వణికిపోతోందంటూ వరుస ట్వీట్లు
  • ఆనందగజపతిరాజు పెద్దకుమార్తెనంటూ పునరుద్ఘాటించిన సంచయిత
టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుపై సింహాచలం ఆలయ చైర్ పర్సన్, మాన్సాస్ ట్రస్ట్ అధినేత్రి సంచయిత గజపతి ధ్వజమెత్తారు. టీడీపీ సీనియర్ నాయకులైన మీరు బాధ్యతారాహిత్యమైన ప్రకటనలు చేయడం, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం భావ్యమా? అంటూ ప్రశ్నించారు.

"నేను అశోక్ గజపతి గారి అన్న ఆనంద గజపతిరాజు గారి పెద్ద కుమార్తెను. చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ఎందుకు వణికిపోతోంది? సింహాచలం దేవస్థానంలో ఫోరెన్సిక్ ఆడిట్ ప్రారంభించడం వల్ల మీ తప్పులు మిమ్మల్ని వెంటాడతాయని భయంగా ఉందా? మీ టీడీపీ నేతలు, మద్దతుదారులు దేవాలయ భూములను ఆక్రమించడం నిజం కాదా? టీడీపీకి చెందిన మీ నాయకుడు చైర్మన్ గా ఉన్నప్పుడు ఆలయానికి చెందిన విలువైన వస్తువులు మాయం అయ్యాయని ఆరోపణలు రాలేదా? గడచిన ఐదేళ్లుగా దేవాలయ ఆస్తులపై లెక్కలు ఎందుకు సరిగ్గా రాయలేదు? ఆలయానికి వచ్చే రాబడి, ఖర్చులు చెప్పే ఖాతాలను సరైన పద్ధతిలో ఎందుకు నిర్ధారించలేదు? అంటూ సంచయిత ప్రశ్నల వర్షం కురిపించారు.

"అయ్యన్న గారూ... కొండదిగువన చైర్మన్ కోసం ఉద్దేశించిన బంగ్లాను మీ సహచరుడు అశోక్ ఇంకా ఎందుకు ఖాళీ చేయలేదు? దీని పేరుమీద ఎన్ని బిల్లులు పెట్టారో తెలుసా? కానీ ఈ విషయాలను నేను మాట్లాడడం లేదు. ఎందుకంటే ఆయన తల్లి గతంలో ఇదే బంగ్లాలో ఉన్నారు కాబట్టి... ఆమె జ్ఞాపకాలను ఆయన గుర్తు చేసుకుంటూ ఉంటారని భావిస్తున్నాను కాబట్టి" అంటూ సంచయిత వరుస ట్వీట్లు చేశారు.
Sanchaita
Ayyanna Patrudu
Ashok Gajapathi Raju
Simhachalam
Chandrababu
Telugudesam
Andhra Pradesh

More Telugu News