Gutta Jwala: అర్ధరాత్రి ఉంగరం తెచ్చిన గుత్తా జ్వాల మేనేజర్... తమిళ హీరోతో నిరాడంబరంగా నిశ్చితార్థం

Badminton star Gutta Jwala engagement with Tamil hero Vishnu Vishal
షార్ట్స్‌లో చూడండి
భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల కొంతకాలంగా తమిళ హీరో విష్ణు విశాల్ తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరూ ఎంతో నిరాడంబరంగా తమ నిశ్చితార్థం జరుపుకున్నారు. ఇవాళ జ్వాల పుట్టినరోజు. ఈ సందర్భంగానే ఉంగరాలు మార్చుకున్నట్టు తెలిసింది.

దీనిపై విష్ణు విశాల్ సోషల్ మీడియాలో స్పందించాడు. "ఇది  జీవితాలకు నూతన ఆరంభం. ఇలాగే సానుకూల దృక్పథంతో కొనసాగుదాం. బసంత్ జైన్ (గుత్తా జ్వాల మేనేజర్) అర్ధరాత్రి వేళలోనూ మాకోసం ఉంగరం తీసుకువచ్చాడు. ఆయనకు ధన్యవాదాలు. మాకు మీ అందరి దీవెనలు కావాలి" అంటూ విష్ణువిశాల్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశాడు.
Go Back to Shorts
Gutta Jwala
Vishnu Vishal
Engagement
Wedding

More Telugu News