Sachin Tendulkar: సచిన్ వడాపావ్ చేస్తుండగా.. ఊహించని అతిథి ప్రత్యక్షం!

Unexpected guest appeared when Sachin preparing Vada Pav
  • వడాపావ్ ను అమితంగా ఇష్టపడే సచిన్
  • వడాపావ్ చేస్తుండగా పిల్లి ప్రత్యక్షం
  • ఇన్స్టాలో ఫొటోలు షేర్ చేసిన సచిన్
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కు అత్యంత ఇష్టమైనది 'స్ట్రైట్ డ్రైవ్'. అనేక ఇంటర్వ్యూలలో దీని గురించి సచిన్ తెలిపాడు. అయితే సచిన్ అమితంగా ఇష్టపడే వాటిలో 'వడాపావ్' వంటకం కూడా మరొకటి. ముంబైలో వడాపావ్ అనేది చాలా పాప్యులర్ ఫాస్ట్ ఫుడ్ అనే విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది.

తన ఇంట్లో వడాపావ్ ను సచిన్ చేస్తుండగా ఒక ఊహించని అతిథి అక్కడ ప్రత్యక్షమైంది. ఈ విషయాన్ని సచిన్ ఇన్ట్సాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. ఆ అతిథి ఎవరో తెలుసుకోవాలంటే స్వైప్ చేయండి అంటూ రెండు ఫొటోలను షేర్ చేశాడు. పక్క నుంచి తొంగి చూస్తున్న పిల్లి ఫొటోను సచిన్ షేర్ చేశాడు. ఈ ఫొటోలపై నెటిజన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది. నాక్కుడా ఒక వడాపావ్ చేయమని సచిన్ ను హర్భజన్ సింగ్ రిక్వెస్ట్ చేశాడు.
Sachin Tendulkar
Vada Pav
Team New Zealand

More Telugu News