Vijay Sai Reddy: వైఎస్సార్ లాగా, సీఎం జగన్ లాగా చంద్రబాబును గుర్తుకు తెచ్చే పథకం ఒక్కటంటే ఒక్కటీ లేదు: విజయసాయిరెడ్డి

YCP MP Vijayasai Reddy comments on Chandrababu in the wake of YSR Sampoorna Poshana
  • వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం ప్రారంభించిన సీఎం జగన్
  • అబద్ధాలు చెబుతాడంటూ చంద్రబాబుపై విజయసాయి వ్యాఖ్యలు
  • పెట్టుబడిదారీ ముఠా తయారుచేశాడంటూ విమర్శలు
పిల్లలు, తల్లుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఏపీ సీఎం జగన్ నేడు వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం ప్రారంభించిన నేపథ్యంలో వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహానేత వైఎస్సార్ లాగా, సీఎం జగన్ లాగా చంద్రబాబును గుర్తుకు తెచ్చే పథకం ఒక్కటీ లేదని అభిప్రాయపడ్డారు. ఎన్నికల ముందు నోటికొచ్చిన అబద్ధాలు చెబుతాడని, డబ్బు వెదజల్లి ప్రజాభిప్రాయాన్ని మార్చవచ్చనే భ్రాంతిలో మునిగితేలుతుంటాడని చంద్రబాబుపై విమర్శలు చేశారు. దీనికోసం ఒక నయా పెట్టుబడిదారీ ముఠాను తయారుచేశాడని ట్విట్టర్ లో పేర్కొన్నారు.

వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకం ద్వారా 30 లక్షల 16 వేల మంది గర్భవతులు, పిల్లలు నాణ్యమైన పోషకాహారం పొందుతారని విజయసాయి వెల్లడించారు. రానున్న రోజుల్లో గ్రామీణ ప్రజల ఆరోగ్య పరిస్థితిలో గణనీయమైన మార్పును చూస్తారని తెలిపారు.
Vijay Sai Reddy
Chandrababu
Jagan
YSR
YSR Sampoorna Poshana

More Telugu News