Keerthi Suresh: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

  • కీర్తి సురేశ్ సినిమా షూటింగ్ పూర్తి 
  • వచ్చే నెల నుంచి మహేశ్ షూటింగ్
  • రవితేజ సినిమాలో లావణ్య త్రిపాఠి
  • 40 కోట్లతో నారా రోహిత్ సినిమా
Keerthi Suresh film Good Luck Sakhi shoot wrapped up

*  కీర్తి సురేశ్ ప్రధాన పాత్రధారిగా రూపొందుతున్న 'గుడ్ లక్ సఖి' చిత్రానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను ఇటీవల దర్శకుడు నగేశ్ కుకునూర్ హైదరాబాదులో చిత్రీకరించారు. దీంతో షూటింగ్ మొత్తం పూర్తయింది. ఇందులో ఆది పినిశెట్టి హీరోగా నటించాడు.
*  మహేశ్ బాబు, పరశురాం కాంబినేషన్లో రూపొందే 'సర్కారు వారి పాట' చిత్రం తొలి షెడ్యూలు షూటింగును అక్టోబర్ నుంచి నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారట. ఇందులో మహేశ్ ద్విపాత్రాభినయం చేయనున్నట్టు వార్తలొస్తున్నాయి. కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తోంది.
*  ప్రస్తుతం 'క్రాక్' చిత్రంలో నటిస్తున్న రవితేజ, దీని తర్వాత మహేశ్ వర్మ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేయనున్నాడు. ఇందులో రవితేజ డబుల్ రోల్స్ చేయనున్నాడని అంటున్నారు. ఈ చిత్రంలో ఇప్పటికే ఓ హీరోయిన్ గా నిధి అగర్వాల్ ను ఎంపిక చేయగా, మరో కథానాయికగా లావణ్య త్రిపాఠిని పరిశీలిస్తున్నారట.
*  గత కొన్నాళ్లుగా కెమెరాకు దూరంగా వున్న యంగ్ హీరో నారా రోహిత్ త్వరలో నూతన దర్శకుడు రూపొందించే ఓ చిత్రంలో నటించనున్నాడు. ఇందుకోసం వర్కౌట్స్ చేసి వెయిట్ కూడా బాగా తగ్గాడు. ఈ చిత్రాన్ని సుమారు 40 కోట్ల భారీ బడ్జెట్టుతో నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

More Telugu News