Corona Virus: దేశంలో 41 లక్షలు దాటిన క‌రోనా కేసులు .. ఒక్క రోజులో 90,633 కేసులు

COVID19 tally crosses 41 lakh mark
షార్ట్స్‌లో చూడండి
భారత్‌లో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. కరోనా కేసుల సంఖ్య 41 లక్షలు దాటింది. గత 24 గంటల్లో 90,633 మందికి కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన బులెటిన్‌లో పేర్కొంది. ఒక్కరోజులో నమోదైన కేసుల్లో అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 1,065 మంది మృతి చెందారు.
     
దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం  41,13,812కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం   70,626 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 31,80,866  మంది కోలుకున్నారు.  8,62,320  మందికి ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది.  
                                               
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 4,88,31,145 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 10,92,654 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. భారత్‌లో రికవరీ రేటు 77.23 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.73 శాతం ఉందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
Go Back to Shorts
Corona Virus
COVID-19
India

More Telugu News