Corona Virus: ఏపీలో మ‌రో 10,825 మందికి క‌రోనా నిర్ధార‌ణ‌.. ల‌క్ష‌దాటిన యాక్టివ్ కేసులు

spike of 10825 cases in ap
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో కరోనా తీవ్రత మరింత పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో మ‌రో 10,825 మందికి క‌రోనా సోకింద‌ని ఏపీ వైద్య‌, ఆరోగ్య శాఖ తెలిపింది. ‌దాంతో మొత్తం కేసుల సంఖ్య  4,84,436కి చేరింది. ఇప్పటివరకు 3,79,209 మంది డిశ్చార్జి కాగా, 1,00,880 మంది చికిత్స పొందుతున్నారు. తాజాగా, 11,941 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మొత్తం 4,347 మంది క‌రోనా వ‌ల్ల‌ ప్రాణాలు కోల్పోయారు.  

తూర్పు గోదావ‌రిలో అత్య‌ధికంగా మొత్తం 65,704 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. గ‌త 24 గంట‌ల్లో ఆ జిల్లాలో అత్య‌ధికంగా 1399 కేసులు న‌మోద‌య్యాయ‌ని ఏపీ వైద్య‌, ఆరోగ్య శాఖ తెలిపింది.  

          
Go Back to Shorts
Corona Virus
COVID-19
India

More Telugu News