USA: 16వ బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌నున్న మ‌హిళ‌!

woman in US going to give birth 16th child
షార్ట్స్‌లో చూడండి
ప్యాటీ హెర్నాండెజ్‌ అనే ఓ మ‌హిళ త‌న 16వ బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది. అమెరికాలోని నార్త్‌ కరోలినాలోని షార్లెట్‌కు చెందిన ప్యాటీ హెర్నాండెజ్‌ (38), కార్లోస్‌ హెర్నాండెజ్‌ (37) దంపతులకు ఇప్పటికే 15 మంది పిల్ల‌లు ఉన్నారు. వారి ఆలనాపాలనా కోసం నెల‌కు రూ. 37 వేల వ‌ర‌కు ఖ‌ర్చు అవుతుంది. ప్యాటీ మూడు సార్లు కవలలకు జ‌న్మ‌నిచ్చింది. ఈ వ‌య‌సులో ఆమె మరోసారి గ‌ర్భం దాల్చింది.

కొన్ని నెల‌ల్లో తాము 16వ బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌నున్న‌ట్లు ఈ దంపతులు ప్ర‌క‌టించారు. తాము గర్భనిరోధక పద్ధతులేమీ పాటించబోమ‌ని ఆ దంప‌తులు తెలిపారు. భగవంతుడు త‌మ‌కు ఏదిస్తే అది తీసుకుంటామని చెప్పుకొచ్చారు. తామిద్ద‌రం క‌లిసి మ‌రి కొంత మంది బిడ్డ‌ల‌ను కంటామ‌ని చెప్పారు.
Go Back to Shorts
USA
birth

More Telugu News