Ram Gopal Varma: 'దిశ' సినిమా కోసం అప్పుడే ప్రమోషన్ మొదలు పెట్టిన వర్మ.. మరిన్ని ఫొటోలు విడుదల!

Pics of RGVs new film Disha
  • దిశ హత్య కథాంశంతో తెరకెక్కుతున్న సినిమా
  • ఈ ఉదయం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
  • తాజాగా మూడు ఫొటోలు విడుదల
హైదరాబాదులో జరిగిన దిశ దారుణ ఘటన కథాంశంతో రామ్ గోపాల్ వర్మ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఈ ఉదయం ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసిన వర్మ... సినిమాకు సంబంధించి ప్రమోషన్ ను అప్పుడే మొదలుపెట్టారు. ఫొటోలు విడుదల చేస్తూ, వాటిని వివరిస్తూ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. టోల్ గేట్ వద్ద దిశ ఎదురు చూస్తున్న సన్నివేశం, లారీలో దుండగుడు ఉన్న సన్నివేశం, దిశను తగలబెట్టిన అండర్ పాస్ ఫొటోలను ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు.
Ram Gopal Varma
Disha Movie
Pics
Tollywood

More Telugu News