Rajamouli: 'ఆర్ఆర్ఆర్' కోసం రాజమౌళి తాజా ప్లాన్స్!

Rajamouli to start shoot for RRR from Vijaya Dashami
  • ఐదు నెలలుగా ఆగిపోయిన షూటింగులు 
  • మధ్యలో కరోనా బారిన దర్శకుడు రాజమౌళి
  • విజయదశమి తర్వాత షూటింగ్ ప్రారంభం
  • ఐదు నెలల్లో మొత్తం పూర్తయ్యేలా ప్లాన్
'ఆర్ఆర్ఆర్' అసలే భారీ ప్రాజక్టు .. పెద్ద పెద్ద తారలు.. పలు కాంబినేషన్లు.. భారీ యాక్షన్ సీన్లు.. షూటింగుకే ఎక్కువ సమయం పట్టే సినిమా. దానికి తోడు కరోనా మూలంగా ఏర్పడిన లాక్ డౌన్ కారణంగా ఇప్పటికే ఐదు నెలలు షూటింగ్ ఆగిపోయిన పరిస్థితి.. ఈమధ్యలో దర్శకుడు రాజమౌళి, చిత్ర నిర్మాత దానయ్య కరోనా బారినపడి కోలుకున్నారు. దీంతో ప్రాజక్టు మరింత ఆలస్యమైంది.

ఈ నేపథ్యంలో ఇక మెల్లమెల్లగా ఒక్కొక్కరూ షూటింగులు మొదలుపెడుతుండడంతో రాజమౌళి కూడా షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. హీరోలు ఎన్టీఆర్, చరణ్ లతో చర్చించిన మీదట విజయదశమి తర్వాత షూటింగును ప్రారంభించాలని ఆయన భావిస్తున్నారట.

ఇప్పటికే ఈ చిత్రం కోసం హైదరాబాదు అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్స్ వేసివుంచారు. వాటిలోనే షూటింగును నిర్వహించాలని అనుకుంటున్నారట. త్వరలోనే వాటిని శానిటైజ్ చేయించి షూటింగుకి సిద్ధం చేయనున్నారు. ఇక మొత్తం నాలుగు నెలలోనే షూటింగ్ పూర్తి చేసేయాలని రాజమౌళి షెడ్యూల్ ని పక్కాగా ప్లాన్ చేస్తున్నారట.          
Rajamouli
RRR
Jr NTR
Ramcharan

More Telugu News