KTR: బావా త్వరగా కోలుకో: కేటీఆర్ ట్వీట్

Get well soon Bava says KTR
  • కరోనా బారిన పడిన హరీశ్ రావు
  • స్వయంగా వెల్లడించిన హరీశ్
  • త్వరగా కోలుకుంటావనే నమ్మకం ఉందన్న కేటీఆర్
తెలంగాణ మంత్రి హరీశ్ రావు కరోనా బారిన పడ్డారు. కరోనా లక్షణాలు ఉంటే టెస్ట్ చేయించుకున్నానని... కరోనా పాజిటివ్ అని రిపోర్టులో వచ్చిందని ఆయన స్వయంగా వెల్లడించారు. తన ఆరోగ్యం బాగానే ఉందని... తనను కలిసిన  వారందరూ టెస్టులు చేయించుకోవాలని, ఐసొలేషన్ లో ఉండాలని సూచించారు. మరోవైపు హరీశ్ కు  కరోనా రావడంపై కేటీఆర్ స్పందించారు. 'బావా కరోనా నుంచి త్వరగా కోలుకో. ఇతరుల కంటే నీవు త్వరగా కోలుకుంటావనే నమ్మకం నాకుంది' అని ట్వీట్ చేశారు.
KTR
Harish Rao
TRS
Corona Virus

More Telugu News