చైనాలోని తమ కంపెనీలకు జపాన్ ఆఫర్.. భారత్‌కు తరలిస్తే భారీ రాయితీలు ఇస్తామని ప్రకటన
- ప్రోత్సాహకాల కోసం 23,550 యెన్‌ల కేటాయింపు
- ఆసియాన్ ప్రాంతంలో కంపెనీల విస్తరణను ప్రోత్సహించే లక్ష్యం
- భారత్‌లో పెరగనున్న పెట్టుబడులు
ఔషధ, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్ని ఆసియా దేశాలన్నింటికీ విస్తరించాలన్నది జపాన్ ప్రభుత్వ లక్ష్యమని ఆ నివేదిక వివరించింది. వాస్తవానికి జపాన్‌కి చెందిన ఉత్పత్తి ప్లాంట్లు అత్యధికం చైనాలో ఉన్నాయి. అయితే, కరోనా వైరస్ కారణంగా వాటి ఉత్పత్తి నిలిచిపోయింది. మరోవైపు, కరోనా వైరస్ వ్యాప్తికి చైనానే కారణమని ప్రపంచ దేశాలు నిందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చైనా నుంచి కంపెనీలను తరలిస్తే భారీ రాయితీలు ఇస్తామని ప్రకటించడం చైనాకు షాకేనని నిపుణులు చెబుతున్నారు. కాగా, భారత్‌కు తరలిస్తే ప్రోత్సాహకాలు ఇస్తామన్న జపాన్ ప్రకటనతో భారత్‌లో పెట్టుబడులు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.