Corona Virus: దేశంలో మరో 83,341 మందికి కరోనా పాజిటివ్

Indias COVID19 tally crosses 39 lakh mark
షార్ట్స్‌లో చూడండి
భారత్‌లో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. కరోనా కేసుల సంఖ్య 39 లక్షలు దాటింది. గత 24 గంటల్లో 83,341 మందికి కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన బులెటిన్‌లో పేర్కొంది. ఒక్కరోజులో నమోదైన కేసుల్లో అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 1,096 మంది మృతి చెందారు.
     
దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 39,36,748కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 68,472 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 30,37,152 మంది కోలుకున్నారు. 8,31,124 మందికి ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది.  
                              
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 4,66,79,145 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 11,69,765 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Go Back to Shorts
Corona Virus
COVID-19
India

More Telugu News