Sajjala Ramakrishna Reddy: ఎంతైనా చంద్రబాబు గారి పద్ధతే వేరు: సజ్జల విమర్శలు

AP Government adviser Sajjala Ramakrishnareddy criticizes Chandrababu
  • హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చిన చంద్రబాబు
  • స్వయం నిర్బంధం వీడారంటూ సజ్జల వ్యంగ్యం
  • అచ్చెన్న, కొల్లు రవీంద్రకు చంద్రబాబు పరామర్శ
  • గ్యాస్ లీక్ బాధితులను ఇంతవరకు పరామర్శించలేదన్న సజ్జల
హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈ సాయంత్రం పార్టీ నేతలు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలను పరామర్శించారు. దీనిపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఎంతైనా చంద్రబాబు గారి పద్ధతే వేరు అంటూ విమర్శలు చేశారు. కరోనా భయంతో చాలా నెలలకు హైదరాబాదులో స్వయం నిర్బంధం నుంచి బయటకు వచ్చారని ఎద్దేవా చేశారు.

"చంద్రబాబు... కార్మికుల సొమ్ము మింగేసి బెయిల్ పై బయటికి వచ్చిన అచ్చెన్నాయుడిని, హత్యకేసులో అరెస్టయిన రవీంద్రను పరామర్శిస్తున్నారు... కానీ ఇంతవరకు విశాఖ గ్యాస్ లీక్ బాధితులను పరామర్శించడానికి మాత్రం వెళ్లలేదు" అంటూ విమర్శించారు. తనను వెళ్లనివ్వకుండా విమానాలను అడ్డుకున్నారని, ఆంక్షలు విధించారని ఇదే వ్యక్తి నానా నిందలు మోపారంటూ సజ్జల ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. అసలు, ప్రజల పట్ల ఈయనకు మమకారం, బాధ్యత ఉన్నాయా? అని ప్రశ్నించారు.
Sajjala Ramakrishna Reddy
Chandrababu
Atchannaidu
Kollu Ravindra
Vizag Gas Leak
Telugudesam
YSRCP

More Telugu News