Sai Pallavi: ఎఫ్ఎంజీఈ పరీక్ష కేంద్రంలో సాయిపల్లవి సందడి

Actress Sai Pallavi appears at FMGE exam centre in Trichy
  • జార్జియాలో మెడిసిన్ చదివిన సాయిపల్లవి
  • తాజాగా మెడికల్ బోర్డు పరీక్షకు హాజరు
  • సాయిపల్లవితో ఫొటోలకు ఎగబడిన వైనం
చిన్నవయసులోనే ప్రతిభావంతురాలైన నటిగా గుర్తింపు పొందిన సాయిపల్లవి జార్జియాలో వైద్య విద్య అభ్యసించిన సంగతి తెలిసిందే. అయితే, కొన్ని విదేశాల్లో డాక్టర్ డిగ్రీలు అందుకున్న వాళ్లు భారత్ లో ప్రాక్టీసు చేసేందుకు అనుమతి లభించాలంటే వారు మెడికల్ బోర్డు నిర్వహించే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ (ఎఫ్ఎంజీఈ) పాస్ కావాల్సి ఉంటుంది. సాయిపల్లవి కూడా ఈ పరీక్ష రాయాలని నిర్ణయించుకుని, కరోనా కారణంగా లభించిన విరామంలో బాగా సన్నద్ధమైంది.

ఈ పరీక్ష రాసేందుకు సాయిపల్లవి తిరుచ్చి వచ్చింది. తిరుచ్చిలోని ఓ ఎగ్జామ్ సెంటర్ లో ప్రత్యక్షమైన సాయిపల్లవిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆమెతో సెల్ఫీలకు, ఫొటోలకు ఎగబడడంతో పరీక్ష కేంద్రంలో సినీ సందడి నెలకొంది. పాపం సాయిపల్లవి... తాను మాస్కు ధరించి వచ్చినా అందరూ గుర్తుపట్టడంతో చేసేది లేక చిరునవ్వుతో ఫొటోలకు పోజులిచ్చి అందరినీ సంతోషపెట్టింది.


Sai Pallavi
FMGE
Exam
Medicine

More Telugu News