Prabhas: ప్రభాస్ 'ఆదిపురుష్'పై రేపు ఉదయం అప్ డేట్!

Update on Prabhas Adipurush will be out tomorrow
  • ఓం రౌత్ దర్శకత్వంలో 'ఆదిపురుష్'
  • 350 కోట్ల బడ్జెట్టుతో పౌరాణిక చిత్రం
  • ఉదయం 7.11 నిమిషాలకి అప్ డేట్
  • విలన్ పేరు ప్రకటించే అవకాశం
ప్రభాస్ కథానాయకుడుగా రూపొందే 'ఆదిపురుష్' హిందీ చిత్రం ప్రారంభం కాకముందే రోజుకొక విశేషంతో అందరిలోనూ ఆసక్తిని, కుతూహలాన్ని రేకెత్తిస్తోంది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని 350 కోట్ల భారీ బడ్జెట్టుతో నిర్మిస్తున్నారు.

రామాయణం ఆధారంగా రూపొందే ఈ పౌరాణిక చిత్రం జనవరి నుంచి సెట్స్ కు వెళుతుంది. రెండు నెలల్లోనే షూటింగును పూర్తిచేసేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే, వీఎఫ్ఎక్స్ పనులకి ఎక్కువ సమయం పడుతుందట. ఇక ఈ చిత్రం గురించి రేపు ఒక కీలకమైన అప్ డేట్ రాబోతోంది. ఈ విషయాన్ని హీరో ప్రభాస్ తో పాటు, చిత్ర దర్శకుడు ఓం రౌత్ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు.

'7000 సంవత్సరాల క్రితం ప్రపంచంలోనే అత్యంత తెలివైన రాక్షసుడు ఒకడు ఉండేవాడు.. రేపు ఉదయం 7.11 నిమిషాలకు' అంటూ పోస్ట్ పెట్టారు. దీనిని బట్టి ఈ చిత్రంలో నటించే విలన్ పాత్రధారి పేరును ప్రకటిస్తారని అంతా ఊహిస్తున్నారు. ఇందులో రావణుడిని పోలిన విలన్ పాత్రను బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్ పోషించనున్నట్టు ఇటీవల వార్తలొచ్చాయి. మరి ఆయనో, కాదో రేపు తేలిపోవచ్చు!
Prabhas
Adipurush
Om Routh
Saif Ali Khan

More Telugu News