మా రాష్ట్రంలో 75 శాతం మంది జేఈఈ పరీక్షలు రాయలేకపోయారు: కేంద్రంపై మమతాబెనర్జీ ఫైర్
- పశ్చిమబెంగాల్ లో కేవలం 1,167 మంది మాత్రమే జేఈఈ రాశారు
- కరోనా సమయంలో పరీక్షలు నిర్వహించడం దారుణం
- లాక్ డౌన్ విధించే అధికారం రాష్ట్రాలకు లేకుండా చేయడం దారుణం
అన్ లాక్-4 నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు లోకల్ లాక్ డౌన్ ను విధించకూడదనే కేంద్ర హోంశాఖ ఉత్తర్వులపై కూడా మమత ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పరిధిలో లాక్ డౌన్ విధించే అధికారం రాష్ట్రాలకు లేకుండా చేయడం దారుణమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం నమ్మాలని చెప్పారు. కేంద్రం మార్గదర్శకాలను విడుదల చేసినంత మాత్రాన సరిపోదని... వాటిని అమలు చేయాల్సింది రాష్ట్రాలేనని చెప్పారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఎలా ఉందో జిల్లా యంత్రాంగానికే తెలుస్తుందని అన్నారు. ఫెడరలిజంకు ఇదే కీలకమని చెప్పారు. కోల్ కతా మెట్రో రైలు సేవలను ప్రారంభించే అంశంపై ఈ నెల 15 లోపల నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.