ఈ మాట గట్టిగా చెప్పినందుకు గాడ్ బ్లెస్ యూ: మంచు లక్ష్మికి విద్యాబాలన్ అభినందనలు
- సుశాంత్ వ్యవహారంలో రియాపై ఆరోపణలు
- రియాకు మద్దతుగా వ్యాఖ్యలు చేసిన మంచు లక్ష్మి
- సుశాంత్ వ్యవహారం మీడియా సర్కస్ లా మారిందన్న విద్యా
తాజాగా మంచు లక్ష్మి వ్యాఖ్యలపై బాలీవుడ్ నటి విద్యా బాలన్ హర్షం వ్యక్తం చేశారు. రియాకు మద్దతు ఇచ్చేందుకు ధైర్యంగా ముందుకొచ్చిందంటూ మంచు లక్ష్మిని అభినందించారు. గాడ్ బ్లెస్ యూ మంచు లక్ష్మి అంటూ విద్యా సందేశం వెలువరించారు. దురదృష్టవశాత్తు సుశాంత్ రాజ్ పుత్ విషాద ఘటన ఓ మీడియా సర్కస్ లా మారిపోయిందని విచారం వ్యక్తం చేశారు. రియా చక్రవర్తిని దుర్భాషలాడుతున్న తీరు ఓ స్త్రీగా తనను ఎంతో ఆవేదనకు గురిచేస్తోందని పేర్కొన్నారు. ఓ వ్యక్తి రాజ్యాంగపరమైన హక్కుల పట్ల ప్రతి ఒక్కరూ గౌరవం చూపాల్సిన అవసరం ఉందని విద్యాబాలన్ స్పష్టం చేశారు.