బిగ్ బాస్ లో పాల్గొనడంపై క్లారిటీ ఇచ్చిన సినీనటి కల్పిక గణేశ్!
- త్వరలోనే ప్రారంభం కానున్న బిగ్ బాస్ 4
- కల్పిక గణేశ్ పాల్గొనబోతోందంటూ వార్తలు
- ఎప్పటికీ ఈ షోలో పాల్గొనని స్పష్టం చేసిన కల్పిక
మరోవైపు, ఈ షోలో సినీనటి కల్పిక గణేశ్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై తాజాగా ఆమె స్పందిస్తూ, ఈ రియాల్టీ షోలో ఇప్పుడే కాదు, ఎప్పటికీ తనను చూడలేరని తెలిపింది. భవిష్యత్తులో కూడా ఈ షోలో తాను పాల్గొనబోనని స్పష్టం చేసింది. దీంతో, ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడినట్టైంది.