Pranab Mukherjee: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత

Pranab Mukherjee passes away as his son Abhijit Mukherjee announced
  • తన తండ్రి తుదిశ్వాస విడిచారని తనయుడు అభిజిత్ వెల్లడి
  • మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆసుపత్రిపాలైన ప్రణబ్
  • ఆపై కరోనా పాజిటివ్
  • కొన్నిరోజుల కిందట కోమాలోకి వెళ్లిన వైనం
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇకలేరు. తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిపాలైన ఆయన చాలారోజుల పాటు కోమాలో ఉండి, కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ప్రణబ్ తనయుడు అభిజిత్ ముఖర్జీ వెల్లడించారు. ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆసుపత్రి వైద్యులు శ్రమపడినా ఫలితం దక్కలేదని, దేశవ్యాప్తంగా పూజలు, ప్రార్థనలు నిర్వహించినా ఫలితం దక్కలేదని తెలిపారు.

తన తండ్రి ఆరోగ్యం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అభిజిత్ ట్విట్టర్ లో వెల్లడించారు. ప్రణబ్ ముఖర్జీ కొన్నివారాల కిందట మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆసుపత్రిపాలయ్యారు. ఈ క్రమంలో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఊపిరితిత్తులకు తీవ్ర ఇన్ఫెక్షన్ సోకింది. కొన్నిరోజులుగా ఆయన కోమాలోనే ఉన్నారు.
Pranab Mukherjee
Demise
Coma
Corona Virus
New Delhi
Former President Of India

More Telugu News