Bear Grylls: అక్షయ్ కుమార్ తో ఈ సాహస ఎపిసోడ్ పట్ల గర్విస్తున్నాను: బేర్ గ్రిల్స్

Bear Grylls says he feels proud after an adventurous episode
  • అక్షయ్ కుమార్ తో బేర్ గ్రిల్స్ స్పెషల్ ఎపిసోడ్
  • సెప్టెంబరు 14న ఇంటూ ద వైల్డ్ ఎపిసోడ్ ప్రసారం
  • రియల్ హీరో అంటూ బేర్ ను కొనియాడిన అక్షయ్
డిస్కవరీ చానల్లో ప్రసారమయ్యే మ్యాన్ వర్సెస్ వైల్డ్ కార్యక్రమంతో ప్రపంచవ్యాప్తంగా పాప్యులారిటీ సంపాదించుకున్న బ్రిటీష్ సాహసికుడు బేర్ గ్రిల్స్ కొంతకాలంగా భారత ప్రముఖలతో ఇంటూ ద వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నాడు.

ఇప్పటికే బేర్ గ్రిల్స్... ప్రధాని నరేంద్ర మోదీ, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తో స్పెషల్ ఎపిసోడ్లు రూపొందించాడు. తాజాగా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తో చిత్రీకరించిన లేటెస్ట్ ఎపిసోడ్ సెప్టెంబరు 11న డిస్కవరీ ప్లస్ ఓటీటీ వేదికపైనా, సెప్టెంబరు 14న డిస్కవరీ చానల్లోనూ ప్రసారం కానుంది.

దీనిపై బేర్ గ్రిల్స్ స్పందించాడు. భారత్ లో దిగ్గజ సినీ తారల్లో ఒకడైన అక్షయ్ కుమార్ తో ఈ సాహసం చేయడం పట్ల గర్విస్తున్నానని తెలిపాడు. దీనికి సంబంధించిన టీజర్ కూడా పోస్టు చేశాడు. లెజెండరీ యాక్టర్ అంటూ అక్షయ్ ని పొగడగా, తాను రీల్ హీరోనని, బేర్ మాత్రం రియల్ హీరో అని అక్షయ్ వినమ్రంగా పేర్కొనడం ఈ టీజర్ లో చూడొచ్చు.

Bear Grylls
Akshay Kumar
Adventure
Into The Wild
Discovery

More Telugu News