Raghu Ramakrishna Raju: ఒక సామాజికవర్గానికి చెందిన కాంట్రాక్టర్లకు ప్రభుత్వం డబ్బులు చెల్లించడం లేదు: రఘురామకృష్ణరాజు 

Contractors have not been paid bills by govt says Raghu Raju
  • కాంట్రాక్టర్లకు రూ. 25 వేల వరకు బకాయిలు ఉన్నాయి
  • బంధుప్రీతి ఉన్న వారికి  మాత్రమే బిల్లులు చెల్లిస్తున్నారు
  • మా పార్టీలో విలువలు మాటలకే పరిమితమయ్యాయి
సొంత పార్టీపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి విమర్శలు గుప్పించారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం కాంట్రాక్టర్లకు రూ. 25 వేల కోట్ల వరకు బకాయి పడిందని చెప్పారు. ఒక సామాజికవర్గానికి సంబంధించిన కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించడం లేదని విమర్శించారు. బంధుప్రీతి ఉన్న వారికి మాత్రమే బిల్లులు చెల్లిస్తున్నారని చెప్పారు.

తమ పార్టీలో విలువలు మాటలకే పరిమితమయ్యాయని... విలువలు అనేవి చేతల్లో కూడా ఉండాలని హితవు పలికారు. కాంట్రాక్టర్ల కష్టాలు ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లడం లేదని రఘురాజు అన్నారు. వీటిని సీఎం దృష్టికి అధికారులు ఎందుకు తీసుకెళ్లడం లేదని ప్రశ్నించారు. మూడు రాజధానులు అనేది కేవలం భ్రమ మాత్రమేనని ఎద్దేవా చేవారు.
Raghu Ramakrishna Raju
YSRCP
Jagan
Contractors
Payments

More Telugu News