Atchannaidu: ఆసుపత్రి నుంచి అచ్చెన్నాయుడు డిశ్చార్జి... స్వగ్రామానికి పయనం

Atchannaidu discharged from NRI hospital after he tested corona negative
  • ఎన్నారై ఆసుపత్రిలో కరోనా చికిత్స పొందిన అచ్చెన్న
  • తాజా పరీక్షలో కరోనా నెగెటివ్
  • మూడ్రోజుల క్రితం ఈఎస్ఐ స్కాంలో బెయిల్ మంజూరు
మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగెటివ్ రావడం తెలిసిందే. దాంతో అచ్చెన్నాయుడును ఎన్నారై ఆసుపత్రి నుంచి ఈ సాయంత్రం డిశ్చార్జి చేశారు. దాంతో ఆయన ఆసుపత్రి నుంచి శ్రీకాకుళంలోని తన స్వగ్రామం నిమ్మాడకు బయల్దేరారు. ఈఎస్ఐ కొనుగోళ్ల అవకతవకల కేసులో అచ్చెన్నకు మూడ్రోజుల కిందటే కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

ఈఎస్ఐ కొనుగోళ్లలో కుంభకోణం జరిగిందంటూ అచ్చెన్నను ఏసీబీ కొన్నినెలల కిందట అరెస్ట్ చేసింది. అయితే ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నందున గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోనూ, ఆపై రమేశ్ ఆసుపత్రిలోనూ చికిత్స అందించారు. కరోనా సోకడంతో కోర్టు ఆదేశాల మేరకు ఎన్నారై ఆసుపత్రికి తరలించారు. కరోనా నయం కావడంతో ఆయన తన స్వగ్రామానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
Atchannaidu
Corona Virus
Negative
NRI Hospital
Discharge
ESI Scam
Telugudesam

More Telugu News