Atchannaidu: అచ్చెన్నాయుడికి కరోనా నెగెటివ్‌గా నిర్ధారణ

atchannaidu test corona negative
షార్ట్స్‌లో చూడండి
ఈఎస్‌ఐ కుంభకోణంలో టీడీపీ నేత అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయనకు కరోనా సోకింది. తాజాగా, ఆయనకు కరోనా పరీక్షలు చేయగా నెగెటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయనను త్వరలోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

ఈఎస్‌ఐ కేసులో అచ్చెన్నాయుడిని ఇప్పటికే ఏసీబీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. ఈఎస్ఐ స్కాంలో ఇప్పటివరకు  12 మందిని అరెస్ట్ చేశారు. కొన్నిరోజుల క్రితం కరోనా బారినపడిన అచ్చెన్నాయుడిని మెరుగైన చికిత్స కోసం గుంటూరు రమేశ్ ఆసుపత్రి నుంచి ఎన్నారై ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే.
Go Back to Shorts
Atchannaidu
Telugudesam
Corona Virus

More Telugu News