Corona Virus: దేశంలో 36 లక్షలు దాటిన కరోనా కేసులు

over 36 lakh total corona cases in india
షార్ట్స్‌లో చూడండి
భారత్‌లో కొవిడ్-19 కేసులు 36 లక్షలు దాటాయి. గత 24 గంటల్లో 78,512 మందికి కరోనా సోకిందని, అదే సమయంలో 971 మంది మృతి చెందారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
     
దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 36,21,246కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 64,469కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 27,74,802 మంది కోలుకున్నారు. 7,81,975 మందికి ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది.  
                                   
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 4,23,07,914 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 8,46,278 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Go Back to Shorts
Corona Virus
COVID-19
India

More Telugu News