Worm: మెదడులో ఏలికపాము... 17 ఏళ్లు అవస్థపడిన చైనా యువకుడు!

  • పేగుల్లో ఉండాల్సిన పరాన్నజీవి మెదడులో ప్రత్యక్షం
  • 2015లో గుర్తించిన వైద్యులు
  • ఇన్నాళ్లకు శస్త్రచికిత్స
Parasitic worm lives in brain for seventeen years

సాధారణంగా పేగుల్లో నివాసం ఏర్పరచుకునే ఏలికపాము ఓ యువకుడి మెదడులో దర్శనమివ్వడం చైనా వైద్య వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. చెన్ అనే 23 ఏళ్ల యువకుడు 2015లో శరీరంలో సగభాగం చచ్చుబడడంతో డాక్టర్లను సంప్రదించాడు. తల భాగాన్ని స్కానింగ్ తీసిన వైద్యులు రిజల్ట్ చూసి నమ్మలేకపోయారు. అతడి మెదడులో 5 అంగుళాల పొడువైన ఓ ఏలికపామును గుర్తించారు. ఇది చాలా అరుదైన పరాన్నజీవి అని, వైద్య పరిభాషలో దీన్ని స్పరాగనోసిస్ మాన్సొని అని పిలుస్తారు.

అయితే, చెన్ తలలో ఈ ఏలికపామును 2015లోనే గుర్తించినా, దాన్ని శస్త్రచికిత్స చేసి తొలగించేందుకు ఇన్నాళ్లు పట్టింది. సర్జరీ చేసి తొలగించేందుకు అనువుగా ఆ పరాన్నజీవి పొజిషన్ లో లేకపోవడమే అందుకు కారణం. ఎలాగైతేనేం, చైనా వైద్యులు ఆ యువకుడిని మళ్లీ మామూలు మనిషిని చేశారు.

వాస్తవానికి ఆరేళ్ల వయసులోనే చెన్ కు శరీర భాగాల్లో స్పర్శ లేనట్టుగా అనిపించేదట. అయితే, అతడి తల్లిదండ్రులు మాత్రం అది వంశపారంపర్యంగా వచ్చిన జబ్బు అయ్యుంటుందని సరిపెట్టుకున్నారు. కానీ, ఆ పరాన్నజీవి 17 ఏళ్లపాటు చెన్ మెదడులోనే నివాసం ఏర్పరుచుకుని ఉన్నట్టు వైద్య పరీక్షల్లో వెల్లడైంది.

More Telugu News