Nimmakayala Chinarajappa: ఎస్సీలపై దమనకాండ కొనసాగుతోంది!: చినరాజప్ప

china rajappa slams jagan
  • ఎన్నికల ముందు ఒక్క అవకాశం ఇవ్వాలన్నారు
  • ప్రజల జీవితాలను ప్రశ్నార్థకం చేస్తున్నారు
  • ఎస్సీల హక్కులను కాలరాస్తున్నారు

ఎన్నికల ముందు ఒక్క అవకాశం ఇవ్వాలంటూ ప్రచారం చేసుకుని అధికారంలోకి వచ్చిన ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ ఇప్పుడు ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోవట్లేదని టీడీపీ నేత చినరాజప్ప మండిపడ్డారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... జగన్‌కు ఇచ్చిన ఒకే ఒక్క అవకాశం ప్రజల జీవితాలను ప్రశ్నార్థకం చేస్తోందని ఆయన అన్నారు.

 వైసీపీకి అంత భారీగా సీట్లిచ్చిన ఎస్సీలపై దమనకాండ కొనసాగుతోందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఎస్సీల హక్కులను కాలరాస్తోందని ఆయన ఆరోపించారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో శిరోముండనం ఘటనలు కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. వీటిని ఉద్దేశిస్తూ వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

  • Loading...

More Telugu News