Nagarjuna: సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన నాగార్జున

Nagarjuna thanked CM Jahan who wished him on birthday
  • నిన్న నాగ్ పుట్టినరోజు
  • విషెస్ తెలిపిన ఏపీ సీఎం జగన్
  • తిరుగులేని నాయకత్వం అంటూ కొనియాడిన నాగ్
టాలీవుడ్ కింగ్ నాగార్జున నిన్న పుట్టినరోజు జరుపుకున్నారు. బర్త్ డే బాయ్ నాగ్ పై శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. తనకు విషెస్ తెలిపినవారందరికీ నాగ్ ఇవాళ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ సీఎం జగన్ కూడా ఈ అక్కినేని హీరోకి శుభాకాంక్షలు తెలియజేశారు. అందుకు నాగార్జున ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

తాజాగా ట్విట్టర్ లో బదులిచ్చారు. థాంక్యూ డియర్ వైఎస్ జగన్ గారూ అంటూ ధన్యవాదాలు తెలిపారు. మీ శుభాశీస్సులు ఎంతో ఆనందాన్నిచ్చాయని పేర్కొన్నారు. మీకు సుఖశాంతులు, ఆయురారోగ్యాలు లభించాలని కోరుకుంటున్నానని, అలాగే మీ తిరుగులేని నాయకత్వంలో అద్భుతమైన ఆంధ్రప్రదేశ్ కూడా సాకారం అవ్వాలని ఆశిస్తున్నానని నాగ్ ట్వీట్ చేశారు.
Nagarjuna
Jagan
Wishes
Birthday
Andhra Pradesh

More Telugu News