Corona Virus: దేశంలో ఒక్కరోజులో 78,761 మందికి కరోనా

COVID19 case tally crosses 35 lakh mark with a spike of 78761 new cases
షార్ట్స్‌లో చూడండి
భారత్‌లో కొవిడ్-19 కేసులు ప్రతిరోజు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. కొన్నిరోజులుగా 75 వేలకు మించి కేసులు నమోదు అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో 78,761   మందికి కరోనా సోకిందని, అదే సమయంలో 948   మంది మృతి చెందారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
     
దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 35,42,734  కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 63,498  కు  పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 27,13,934  మంది కోలుకున్నారు. 7,65,302    మందికి ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది.  
                                      
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 4,14,61,636   కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 10,55,027    శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Go Back to Shorts
Corona Virus
COVID-19
India

More Telugu News