Nuthan Naidu: ఎస్సీ యువకుడికి శిరోముండనం చేయించారంటూ నూతన్ నాయుడుపై కేసు నమోదు

  • చిక్కుల్లో పడిన బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు
  • నూతన్ నాయుడు ఇంట్లో శిరోముండనం చేశారన్న ఎస్సీ యువకుడు
  • చంపేస్తామని బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్న యువకుడు
Police case filed against Bigg Boss fame Nuthan Naidu

బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు చిక్కుల్లో పడ్డారు. పెందుర్తిలోని సుజాతా నగర్ లో ఉన్న తన ఇంట్లో ఓ ఎస్సీ యువకుడికి  శిరోముండనం చేయించారంటూ ఆయనపై కేసు నమోదైంది. శ్రీకాంత్ అనే ఎస్సీ యువకుడు కొన్నాళ్లు నూతన్ నాయుడు ఇంట్లో పనిచేసి మానేశాడు. సెల్ ఫోన్ పోయిందంటూ ఆ ఎస్సీ యువకుడ్ని నూతన్ నాయుడు తన ఇంటికి పిలిపించారు. ఆపై, నూతన్ నాయుడు ఇంట్లో తనకు శిరోముండనం చేశారంటూ సదరు యువకుడు శ్రీకాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయాన్ని బయటికి చెబితే చంపేస్తామని బెదిరించారని ఆ యువకుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

More Telugu News