సుశాంత్ కేసులో మీడియా సమాంతర విచారణ చేయొద్దు!: ప్రెస్ కౌన్సిల్ హితవు
- రెండు నెలల కిందట సుశాంత్ మరణం
- మీడియాలో విపరీత స్థాయిలో కథనాలు
- పాత్రికేయ నియమావళికి కట్టుబడాలన్న ప్రెస్ కౌన్సిల్
దీనిపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్పందించింది. విచారణలో ఉన్న సుశాంత్ కేసుకు సంబంధించిన కథనాలు ప్రచురించే విషయంలోనూ, ప్రసారం చేసే విషయంలోనూ పాత్రికేయ నియమావళికి కట్టుబడి ఉండాలని మీడియాకు స్పష్టం చేసింది. అంతేకాకుండా, సుశాంత్ వ్యవహారంలో మీడియా సొంతంగా సమాంతర విచారణ చేయడం మానుకోవాలని హితవు పలికింది.