SP Balasubrahmanyam: మెరుగవుతున్న ఎస్పీ బాలు ఆరోగ్యం... అందరికీ కృతజ్ఞతలు తెలిపిన ఎస్పీ చరణ్

SP Balasubrahmanyam health recovers in a slow pace
  • ఎంజీఎం ఆసుపత్రిలో ఎస్పీ బాలుకు కరోనా చికిత్స
  • ఐసీయూలో వెంటిలేటర్ పై ఉన్న బాలు
  • క్రమంగా కోలుకుంటున్నారన్న తనయుడు
గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా భూతం ప్రభావం నుంచి క్రమంగా కోలుకుంటున్నారని ఆయన తనయుడు ఎస్పీ చరణ్ వెల్లడించారు. నిన్నటితో పోల్చితే తన తండ్రి ఆరోగ్యం మెరుగైందని, ఆయన ఊపిరితిత్తులపై కరోనా ప్రభావం తగ్గుతోందని వివరించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆశాజనకంగా ఉందనడానికి అనేక సంకేతాలు కనిపిస్తున్నాయని, తన తండ్రి ఆరోగ్యం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు వీడియో సందేశంలో పేర్కొన్నారు. కొన్నివారాల కిందట కరోనా పాజిటివ్ వచ్చిన ఎస్పీ బాలును చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చేర్చగా, పరిస్థితి క్షీణించడంతో ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స కొనసాగిస్తున్నారు.
SP Balasubrahmanyam
Corona Virus
Positive
MGM Hospital
Chennai
SP Charan
Tollywood
Kollywood

More Telugu News