Ada Sharma: ఆదాశర్మ చిత్రానికి క్వశ్చన్ మార్క్ టైటిల్!

Ada Sharma movie titiled question Mark
షార్ట్స్‌లో చూడండి
అది చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా ముందుగా దాని టైటిల్ బాగుండాలి. టక్కున ఆకట్టుకోవాలి. అప్పుడే ఆ సినిమా పట్ల ప్రేక్షకులలో ఆసక్తి మొదలవుతుంది. అందుకే, దర్శక నిర్మాతలు కాస్త టైం తీసుకుని, ఎంతో ఆలోచించి మరీ తమ సినిమాలకు టైటిళ్లు నిర్ణయిస్తుంటారు.

తాజాగా ముద్దుగుమ్మ ఆదా శర్మ నటిస్తున్న చిత్రానికి కూడా అలాగే ? (క్వశ్చన్ మార్క్) అనే గమ్మత్తయిన టైటిల్ని పెట్టారు. దీనికి సంబంధించిన టైటిల్ లోగోని విడుదల చేశారు. విప్రా దర్శకత్వంలో గౌరీకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

ఈ సందర్భంగా కథానాయిక ఆదా శర్మ చెబుతూ, ఇది హారర్ సినిమా అనీ, దీనికి ? అనే టైటిల్ కరెక్టుగా సరిపోతుందని చెప్పింది. క్వశ్చన్ మార్క్ అంటే ఇక్కడ ఏమిటి? ఎందుకు ఆ టైటిల్ పెట్టాం? అన్నవి ఆసక్తికరంగా ఉంటాయన్నారు. దర్శక నిర్మాతలు మాట్లాడుతూ, టైటిల్ కి మంచి స్పందన వస్తోందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. కరోనా కాలంలో అన్ని జాగ్రత్తలూ తీసుకుని షూటింగుని పూర్తిచేశామని, హైదరాబాదు పరిసరాల్లోనే షూటింగ్ జరిపామని చెప్పారు.  
Go Back to Shorts
Ada Sharma
Film Title
Logo

More Telugu News