Kodali Nani: గల్లీ నుంచి ఢిల్లీ వరకు చంద్రబాబు తన మనుషులను పెట్టుకున్నారు: కొడాలి నాని

Kodali Nani fires on Chandrababu
  • ప్రజల కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది
  • అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి
  • చంద్రబాబు కుయుక్తులను తిప్పికొట్టాలి
ప్రజల కష్టాలను తీర్చడం కోసం తమ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని ఏపీ మంత్రి కొడాలి నాని అన్నారు. పేదల కోసం తాము ఎంతో చేస్తుంటే... అడ్డుకోవడానికి విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో నూతన మార్కెట్ యార్డ్ కార్యవర్గం ఈ రోజు ప్రమాణస్వీకారం చేసింది. ఈ కార్యక్రమానికి కొడాలి నాని, పేర్ని నానిలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ, గల్లీ నుంచి ఢిల్లీ వరకు చంద్రబాబు తన మనుషులను పెట్టుకుని జగన్ చేస్తున్న మంచి పనులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు కుటిల యత్నాలను వైసీపీ కార్యకర్తలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఎవరెన్ని కుట్రలకు పాల్పడినా వైసీపీ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరని చెప్పారు.
Kodali Nani
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News