Nara Lokesh: జర్నలిస్టు శివప్రసాద్ ను ఏపీ పోలీసులు కిడ్నాప్ చేశారు: లోకేశ్

Nara Lokesh tells AP Police kidnapped journalist Sivaprasad
  • నోటీసులు కూడా ఇవ్వకుండా తీసుకెళ్లారన్న లోకేశ్
  • ఫోన్ ను కూడా అక్రమంగా లాగేసుకున్నారని వెల్లడి
  • పోలీసులు సీఎం జగన్ పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు
శివప్రసాద్ అనే జర్నలిస్టును ఏపీ పోలీసులు కిడ్నాప్ చేశారంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా హైదరాబాదులోని అతని నివాస గృహం నుంచే తీసుకెళ్లారని లోకేశ్ వివరించారు.

"ఏంచేశాడని శివప్రసాద్ ను తీసుకెళ్లారు? అతను ఏపీ ప్రభుత్వ విధానాలపై మాట్లాడాడు. అతడి ఫోన్ ను అక్రమంగా తీసేసుకున్నారు. కనీసం ఓ వారెంట్ లేదు, ఓ వార్నింగ్ లేదు. ఈ ఘటన యావత్తు ఆ జర్నలిస్టు కుటుంబం ఆడియో రూపంలో రికార్డు చేసింది. ఈ వ్యవహారంలో జర్నలిస్టు శివప్రసాద్ కు ఎందుకు నోటీసులు ఇవ్వలేదు? అతడి కుటుంబం చూస్తుండగానే ఎందుకు కిడ్నాప్ కు గురయ్యాడు? పోలీసులు సీఎం జగన్ పార్టీ కార్యకర్తల్లా వ్యవహరించడం చూస్తుంటే బాధ కలుగుతోంది. ఇది తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన. పోలీసులు ఘోరమైన తప్పిదానికి పాల్పడ్డారు" అంటూ లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Nara Lokesh
Sivaprasad
Kidnapp
Police
Andhra Pradesh
Journalist

More Telugu News