Bihar: బీహార్ ఎన్నికల వాయిదాకు నిరాకరణ.. జోక్యం చేసుకోలేమన్న సుప్రీంకోర్టు!

  • కరోనా నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేయాలంటూ పిటిషన్
  • సీఈసీని తాము ఆదేశించలేమన్న సుప్రీంకోర్టు
  • అన్ని విషయాలను సుప్రీం పరిగణలోకి తీసుకుంటుందని వ్యాఖ్య
We can not intervene in CECs powers says Supreme Court

కరోనా వైరస్ తో పాటు, భారీ వరదలు సంభవిస్తున్న నేపథ్యంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేసేలా కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వాలన్న పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కరోనా రహిత రాష్ట్రంగా ప్రకటించేంత వరకు ఎన్నికలను నిర్వహించరాదంటూ బీహార్ కు చెందిన రాజేశ్ కుమార్ జైశ్వాల్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్ఎస్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం ఈరోజు విచారించింది.

అన్ని విషయాలను ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకుంటుందని ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. కోవిడ్ కారణంగా ఎన్నికలను వాయిదా వేయాలని తాము ఆదేశించలేమని తెలిపింది. కేంద్ర ఎన్నికల సంఘం అధికారాల్లో తాము ఎలా జోక్యం చేసుకోగలమని ప్రశ్నించింది. ఎన్నికల నిర్వహణపై సీఈసీదే తుది నిర్ణయమని తెలిపింది. మరోవైపు బీహార్ ఎన్నికలు అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో జరిగే అవకాశం ఉంది.

More Telugu News