GVL Narasimha Rao: మావోయిస్టులు, వారి అనుబంధ సంఘాలపై జీవీఎల్ ధ్వజం

BJP MP GVL Narasimharao fired in CPI Maoists and their allies
  • మావోలు వేలమందిని పొట్టనబెట్టుకున్నారంటూ ఆగ్రహం
  • భీమా కోరెగావ్ లో హింసను ఎగదోశారని ఆరోపణ
  • ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారంటూ ట్వీట్

నిషేధిత మావోయిస్టులు, వారి అనుబంధ సంఘాలకు చెందినవారు వేలాది మంది భద్రతా సిబ్బందిని, అమాయకులైన దళితులను, ఆదివాసీలను పొట్టనబెట్టుకున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. భీమా కోరేగావ్ లోనూ హింసను ఎగదోశారని మండిపడ్డారు.

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న ఈ దేశ వ్యతిరేకులు, రాజ్యాంగాన్ని కాపాడండంటూ మోసపూరిత ప్రకటనలు చేస్తుంటారని ఆయన విమర్శించారు. జీవీఎల్ ఇటీవలే విరసం నేత వరవరరావుపైనా ఇదే రీతిలో ఘాటు వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఆగస్టు మొదటివారంలో విశాఖ అటవీప్రాంతంలో మావోలు అమర్చిన మందుపాతర ఇద్దరు గిరిజనులను బలిగొన్నదంటూ జాతీయ మీడియాలో వచ్చిన వార్త నేపథ్యంలో జీవీఎల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News