Pakistan: జనాభా లెక్కలను తారుమారు చేస్తున్న పాకిస్థాన్.. వెలుగులోకి వచ్చిన దారుణాలు!

  • మైనార్టీలను ఊచకోత కోసింది
  • గిల్గిత్ బాల్టిస్థాన్ లో చైనా కార్మికులకు, పాక్ సైన్యానికి ఆవాసం కల్పించింది
  • జమ్మూకశ్మీర్ కోసం భారత్ ఎంతో చేస్తోంది
Pakistan is showing wrong population details in POK says a study

పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఆ దేశం చేస్తున్న దారుణాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. పీవోకేలో ముఖ్యంగా గిల్గిత్ బాల్టిస్థాన్ ను ఆ దేశం దారుణంగా అణచివేస్తోంది. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ పేరుతో ఆ దేశం కొనసాగిస్తున్న క్రూరమైన చేష్టలను లా అండ్ సొసైటీ అలయెన్స్ సంస్థ నిర్వహించిన ఓ అధ్యయనం కళ్లకు కట్టినట్టు బహిర్గతం చేసింది.

ఓ వైపు పంజాబీ వర్గాన్ని అణచివేస్తూనే... మరోవైపు మైనార్టీలను పాక్ ఊచకోత కోస్తోందని అధ్యయనం వెల్లడించింది. సైన్యాన్ని అక్కడ పెద్ద సంఖ్యలో దించి జనాభా లెక్కలను కూడా తారుమారు చేస్తోందని తెలిపింది. పీవోకేలో ఇప్పటికే సిక్కు జనాభాను తుడిచిపెట్టిన పాక్... ఆ ప్రాంతంలో చైనా కార్మికులు, పాక్ సైనికులకు ఆవాసం కల్పిస్తోందని  చెప్పింది.

పీవోకే ప్రాంతానికి సంబంధించి విద్య, ఆరోగ్యం కోసం పాక్ కేటాయిస్తున్న నిధుల కంటే... కశ్మీర్ కోసం భారత ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు ఎన్నో రెట్లు ఎక్కువని అధ్యయనం తెలిపింది. శిశు మరణాల రేటు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో జమ్మూకశ్మీర్ కూడా ఒకటని వెల్లడించింది. విద్యాసంస్థలు, ఉద్యోగ అవకాశాల విషయంలో ఇతర రాష్ట్రాల కంటే జమ్మూ కశ్మీర్ పైస్థానంలో ఉందని తెలిపింది. మానవ అభివృద్ధి సూచీలో పీవోకేలోని గిల్గిత్ బాల్టిస్థాన్ ఎంతో వెనుకబడి ఉందని చెప్పింది. అక్షరాస్యత శాతం కూడా చాలా దారుణంగా ఉందని వెల్లడించింది.

More Telugu News