Chiranjeevi: చిరు, విజయశాంతిలను అనుకరిస్తూ దంపతుల డ్యాన్స్.. చూసి ఆశ్చర్యపోయి, అభినందించిన మెగాస్టార్‌!

MEGASTARs response for a mini attempt
  • నటుడు సుధాకర్ కోమాకుల దంపతుల డ్యాన్స్
  • ఛాలెంజ్‌ సినిమాలోని 'ఇందువదన కుందరదన'కు డ్యాన్స్
  • 'డియర్‌ సుధాకర్, హారిక ఎలా ఉన్నారు? అంటూ చిరు పలకరింపు
  • పుట్టినరోజు నాడు ఇచ్చిన ట్రీట్‌కి కృతజ్ఞతలు
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమా ద్వారా హీరోగా పరిచయమై..అనంతరం పలు సినిమాలు చేసి టాలీవుడ్‌ ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైన నటుడు సుధాకర్ కోమాకుల తాజాగా మెగాస్టార్ చిరంజీవి పాత సినిమాలోని ఓ పాటకు తన భార్యతో కలిసి డ్యాన్స్ చేశాడు.

'ఇందువదన కుందరదన.. మందగమన మధురవచన.. గగన జఘన సొగసు లలనవే.. ఐ లవ్ యూ ఓ హారికా నీ ప్రేమకే జోహారికా' అంటూ ఆ భార్యాభర్తలు చేసిన డ్యాన్స్ బాగా వైరల్ అయింది. ఛాలెంజ్‌ సినిమాలో ఈ పాటకు చిరుతో కలిసి విజయశాంతి డ్యాన్స్ చేశారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సుధాకర్ దంపతులు వారిని అనుకరిస్తూ డ్యాన్స్‌ చేసి చిరుకి గిఫ్ట్ ఇచ్చారు. దీంతో దీనిపై చిరంజీవి స్పందించారు.

'హాయ్ డియర్‌ సుధాకర్, హారిక ఎలా ఉన్నారు? నా పుట్టినరోజు నాడు మీరు ఇచ్చిన ట్రీట్‌కి కృతజ్ఞతలు. ఛాలెంజ్ సినిమాలోని ఆ డ్యాన్స్‌ను నాకు గుర్తు చేశారు. మీకు వచ్చిన ఈ ఆలోచన నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. మీరు అమెరికాలో ఉన్నారు. మీరు భారత్‌లో ఉంటే నా సంతోషాన్ని మరోలా తెలిపేవాడినేమో. హారిక టెక్కీగా పనిచేస్తూ నీతో కలిసి ఇంత చక్కగా డ్యాన్స్ చేయడం నాకు ఆశ్చర్యం వేసింది' అని చిరంజీవి అన్నారు. ఇందుకు సంబంధించిన వాయిస్‌ను పోస్ట్ చేస్తూ సుధాకర్ హర్షం వ్యక్తం చేశాడు.
Chiranjeevi
Tollywood
Viral Videos

More Telugu News