TikTok: టిక్ టాక్ కోసం మైక్రోసాఫ్ట్ తో వాల్ మార్ట్ డీల్!

  • టిక్ టాక్ యూఎస్ ఆస్తుల కోసం గట్టి పోటీ
  • మైక్రోసాఫ్ట్ తో పాటు పోటీ పడుతున్న ఒరాకిల్
  • టిక్ టాక్ ను మరింతగా విస్తరిస్తామన్న వాల్ మార్ట్
Walmart Deal With Microsoft for TikTok

అమెరికాలోని టిక్ టాక్ విభాగాన్ని కొనుగోలు చేసేందుకు ఇప్పటికే మైక్రోసాఫ్ట్ సంస్థ ఆసక్తిని చూపిస్తుండగా, తాజాగా, వాల్ మార్ట్ కూడా వచ్చి చేరింది. టిక్ టాక్ సీఈఓ కెవిన్ మేయర్ రాజీనామా చేసిన గంటల అనంతరం వాల్ మార్ట్ ఐఎన్సీ ఓ ప్రకటన చేస్తూ, మైక్రోసాఫ్ట్ తో తాము డీల్ కుదుర్చుకుని టిక్ టాక్ ను సొంతం చేసుకునేందుకు పోటీలో ఉన్నామని స్పష్టం చేసింది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ తో పాటు ఒరాకిల్ గ్రూప్ సైతం టిక్ టాక్ యూఎస్ ఆస్తుల కోసం పోటీలో ఉండగా, చర్చలు తుది దశలో ఉన్నాయని వార్తలు వస్తున్న వేళ, కెవిన్ రాజీనామా, ఆ వెంటనే వాల్ మార్ట్ పోటీలోకి దిగడం గమనార్హం.

కాగా, ట్రంప్ సర్కారు ఇటీవల టిక్ టాక్ యాజమాన్య సంస్థ, చైనాకు చెందిన బైట్ డ్యాన్స్ కు వార్నింగ్ ఇస్తూ, అమెరికా కార్యకలాపాలు విక్రయించాల్సిందేనని, లేకుంటే మాతృసంస్థతో ఒక్క ఆర్థిక లావాదేవీకి కూడా అనుమతించబోమని హెచ్చరించిన సంగతి తెలిసిందే. మైక్రోసాఫ్ట్ తో కలిసి తాము టిక్ టాక్ ను సొంతం చేసుకుంటే, అమెరికన్ల అంచనాలను అందుకునేలా దాన్ని అభివృద్ధి చేయగలమన్న నమ్మకం ఉందని, యూఎస్ నియంత్రణా సంస్థల నిబంధనలకు అనుగుణంగా సంస్థను నడిపించగలమని తెలుపుతూ వాల్ మార్ట్ ఓ ప్రకటన వెలువరించింది.

More Telugu News