sai tej: 'అమృత ప్రేమలో పడిన విరాట్ మనసులో మాట.. ఈ పాట' అంటూ కొత్త సినిమా సాంగ్ విడుదల చేసిన సాయితేజ్‌

  • 'హేయ్  నేనేనా' అంటూ సాగే పాట
  • సుబ్బు డైరెక్షన్ లో సాయితేజ్‌ సోలో బతుకే సో బెటరు సినిమా  
  • ఇప్పటికే 'నో పెళ్లి' సాంగ్‌ విడుదల
Hey Idi Nenena Lyric From Solo Brathuke So Better  Sai Tej

'అంత స్ట్రిక్ట్‌గా సోలో బ్రతుకు సో బెటర్ అని అందరికీ చెప్పే విరాట్ కి అమృతని చూశాక ఏమైంది?' అంటూ నిన్న సోలో బతుకే సో బెటరు సినిమాలోంచి ఓ పోస్టర్‌ను విడుదల చేసిన మెగా హీరో సాయితేజ్‌ ఈ రోజు ఈ సినిమాలోని పాటను విడుదల చేశారు. 'అమృత ప్రేమలో పడిన విరాట్ మనసులో మాట... ఈ పాట...' అంటూ సాయితేజ్‌ కామెంట్ చేశాడు.

'హేయ్ నేనేనా' అంటూ సాగే ఈ పాట అలరిస్తోంది. సుబ్బు డైరెక్షన్ లో సోలో బతుకే సో బెటరు సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలోంచి 'నో పెళ్లి' సాంగ్‌ని విడుదల చేసిన విషయం తెలిసిందే.    
                       

More Telugu News