Fishes: సుందిళ్ల బ్యారేజి వద్దకు కొట్టుకొచ్చిన వేలాది చేపలు... పట్టుకునేందుకు పోటీలు పడిన ప్రజలు

Huge number of fishes stranded at Sundilla Barrage in Manchiryal district
  • నీటి ప్రవాహం తగ్గడంతో గుంతల్లో చిక్కుకుపోయిన చేపలు
  • టన్నుల కొద్దీ చేపలు కనిపించడంతో పోటెత్తిన ప్రజలు
  • బస్తాలకు బస్తాలు చేపలు పట్టుకున్న వైనం
మంచిర్యాల జిల్లా సుందిళ్ల బ్యారేజి వద్ద వరద ఉద్ధృతి తగ్గిన నేపథ్యంలో టన్నుల కొద్దీ చేపలు బయటపడ్డాయి. వరదనీటికి కొట్టుకొచ్చిన ఆ చేపలు, బ్యారేజి గేట్లు మూసివేసిన నేపథ్యంలో, నీటి ప్రవాహం తగ్గడంతో బ్యారేజి దిగువన ఉన్న గుంతల్లో చిక్కుకుపోయాయి. అక్కడ లోతు తక్కువగా ఉండడంతో సమీప గ్రామాల ప్రజలు తండోపతండాలుగా వచ్చి వాటిని పట్టుకెళుతున్నారు. కొందరు బస్తాల్లో నింపుకుని వెళుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. వేలాది చేపలు ఒక్కచోట కనిపిస్తుండడంతో ప్రజలు వాటిని పట్టుకునేందుకు పోటీలు పడ్డారు. చిన్నచేపలు కనిపిస్తున్నా, వాటిని వదిలేసి పెద్ద చేపలు పట్టుకునేందుకు ఉత్సాహం ప్రదర్శించారు.
Fishes
Sundilla Barrage
Mancherial District
Catch
Floods

More Telugu News