Shripad Naik: ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో విషమంగా మారిన కేంద్రమంత్రి ఆరోగ్యం

Union minister Shripad Naik health condition critical
  • ఆయుష్ మంత్రి శ్రీపాద్ నాయక్ కు కరోనా
  • గోవా మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స
  • ఢిల్లీ నుంచి గోవా బయల్దేరిన ఎయిమ్స్ నిపుణులు
కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి శ్రీపాద్ నాయక్ ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. ఇటీవలే శ్రీపాద్ నాయక్ కరోనా వైరస్ కు గురయ్యారు. ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో గోవాలోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఆయనకు ఉన్నట్టుండి ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో ఆరోగ్య పరిస్థితి విషమించింది. దాంతో ఆయనకు చికిత్స అందించేందుకు ఢిల్లీ నుంచి ఎయిమ్స్ నిపుణుల బృందం గోవా బయల్దేరింది. మణిపాల్ వైద్యుల సూచన మేరకు ఎయిమ్స్ వర్గాలు నిపుణులను పంపాయి.
Shripad Naik
Critical
Corona Virus
Goa
AIIMS

More Telugu News